ముందుమందు-‘పీపుల్ స్టార్’

Rating:
0/10
0

Movie Info

Movie Story

April 18: TOLLYWOOD NEWS:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న చర్యల్ని ప్రశంసిస్తూ.. ‘లాక్ డౌన్’ ఒక్కటే మందు కాదన్నారు పీపుల్ స్టార్ R. Narayana murty.  ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తూ భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ అనే గొప్ప నిర్ణయంతో అద్భుతంగా కరోనాను కట్టిడి చేశారు. అయితే ఈ లాక్ డౌన్‌ను దశల వారీగా పొడిగించుకుంటూ పోవడమే కాకుండా శాశ్వత పరిష్కారం దశగా ఆలోచన చేయాలి. ఎందుకంటే.. లాక్ డౌన్ అంటే అదో మంత్రం కాదు.. వెంటనే కరోనా పారిపోవడానికి. ఈ లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం కాదు. ముందు ఈ భయంకరమైన వైరస్‌కి మందు కనిపెట్టాలి. అంచెలంచెలుగా లాక్ డౌన్‌ను సడలింపజేస్తూ.. లాక్ డౌన్ ఎత్తేసి కూడా ఈ కరోనా మహమ్మారిని జయించగలుగుతున్నాం అనే భరోసాను ప్రజలకు కల్పించాలి ప్రభుత్వాలు. మనిషి స్వేచ్ఛాజీవి.. స్వేచ్ఛగా బతకాలి అదే సందర్భంలో ప్రభుత్వ నిర్ణయాలనకు గౌరవిస్తూ ముందుకు వెళ్లాలి. అలాంటి పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించాలి. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా చాలా మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు.. ఉన్నవాళ్లు చాలా మంది లేని వాళ్లకి పెడుతున్నారు. రేపటి రోజున వాళ్ల ఇంట్లో సామాన్లు అయిపోతే పరిస్థితి ఏంటి? నేను బతకాలంటే స్వార్థం వస్తే అంతర్యుద్ధం ప్రారంభం అవుతుంది. తనకు ఆహారం దొరకనప్పుడు దోచుకోవడానికి కూడా వెనకాడడు మనిషి. ఒకర్నొకరు దోచుకుంటే ఆర్థిక యుద్ధం మొదలు అవుతుంది. దయచేసి ఈ వైరస్‌కి మందు కనిపెట్టేలా చేయండి.. మానవుడు మహా శాస్త్రవేత్త.. గుండెను తీసి గుండెను పెట్టిన వాడు అంతరిక్షంలో కాలు పెట్టినవాడు.. ఇలాంటి వ్యాధికి మందు కచ్చితంగా కనిపెట్టగలడు. స్వార్థంతో ఆలోచించి మందు కనిపెట్టడానికి ముందుకు రాని పారామెడికల్ కంపెనీలపై చర్యలు తీసుకోండి’ అంటూ ఆవేశపూరితంగా మాట్లాడుతూనే ఆలోచింపజేసే కామెంట్స్ చేశారు పీపుల్ స్టార్.

Reviews ( 0 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommend movies


Warning: Invalid argument supplied for foreach() in /homepages/9/d796259956/htdocs/clickandbuilds/RemoteArtandMedia/wp-includes/class-wp-list-util.php on line 151
x
Skip to toolbar