TELUGU CINEMA NEWS: పిజ్జా, జిగర్ తండా(చిక్కడు దొరకడు), పేట సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాత‌ ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న చిత్రo “జగమే తంత్రం” . తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో మంచి స్ధానం సంపాయించిన ‘వై నాట్’ స్థూడియోస్ నిర్మాణం లో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ వున్న‌ హీరో ధనుష్ హీరోగా ,  ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత‌ గోవిందం, టాక్సివాలా, ప్ర‌తిరోజుపండ‌గే లాంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందించిన నిర్మాణ సంస్థ‌లు జిఏ2 పిక్చ‌ర్‌, యువి క్రియెష‌న్స్ ఇప్ప‌డు జిఏ2యువి ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నారు జగమే తంత్రం అనే డిఫరెంట్ టైటిల్ కు  సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది.

One Comments

Leave a Reply