JUNE 19: TOLLYWOOD NEWS:మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించనున్నాసర్కారు వారి పాట.

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 27వ సినిమాలో  హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ పేరును పరిశీలించినప్పటికీ డేట్స్ విషయంలో తేడా రావడంతో దక్షిణాది హీరోయిన్ వైపు మొగ్గుచూపారట నిర్మాతలు.ఈమూవీలో హీరోయిన్ గా  కీర్తిసురేష్‌ ను కన్ఫర్మ్ చేశారు.

తన లేటెస్ట్ మూవీ పెంగ్విన్ విడుదల సంధర్భంగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన కీర్తి సురేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు.ఈ సినిమా హిట్టైతే కీర్తి సురేష్ కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఈ మూవీ అటూ ఇటూ అయితే మాత్రం ఆమె ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పరిమితం కావలసిందే. కాబట్టి సర్కారు వారి పాట మూవీ విజయం ఆమెకు చాలా అవసరం. సంగీతం థమన్.

Leave a Reply