JUNE 22: TOLLYWOOD NEWS: రామానాయుడు స్టూడియోస్‌ లో పునఃప్రారంభ‌మైన రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ సినిమా లవ్ స్టోరీ WITH ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌ గా ‘సూపర్ మచ్చి’. ఈ సినిమా కు తమన్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది.

షూటింగ్ పునఃప్రారంభ‌మైన సందర్భంగా నిర్మాతలు రిజ్వాన్, ఖుషి  మాట్లాడుతూ.. ‘‘తొలి సినిమా ‘విజేత’తోనే నటనతో ఆకట్టుకున్న కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’లో మరింత చక్కటి పర్ఫార్మెన్సుతో అలరిస్తారు. అటు మాస్ ఆడియెన్సుకీ, ఇటు ఫ్యామిలీ ఆడియెన్సుకీ ఆయన క్యారెక్టర్ కనెక్టవుతుంది. సినిమాకు కన్నడ హీరోయిన్ రచితా రామ్ ప్లస్సవుతుంది.ఇప్పటికే చిత్రీకరించిన పాటలు చాలా అందంగా వచ్చాయి. ‘సూపర్ మచ్చి’ టైటిల్ సాంగ్ బ్రహ్మాండంగా వచ్చింది. ఆడియో బ్లాక్ బస్టర్.

SENIOR ARTIST S రాజేంద్రప్రసాద్, నరేష్ అందించే కామెడీ అమితంగా అలరిస్తుంది. హీరోకి సపోర్టింగ్‌గా నరేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మంచి వినోదాన్ని అందిస్తాయి. అలాగే రాజేంద్రప్రసాద్, హీరో కాంబినేషన్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయి అని చెప్పారునిర్మాత .ఈ చిత్రంలో ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.  దర్శకత్వం పులి వాసు.

Leave a Reply