JUNE 17:BOLLYWOOD NEWS:గత 6 నెలల్లో సుశాంత్ ను 7 సినిమాల నుంచి తొలగించారనే ఓ డైరెక్టర్ చెప్పడంతో ఆయన అభిమానులు మరింత షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జొహార్ వంటి సినీ ప్రముఖులపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై దర్శకుడు వర్మస్పందించారు.

డబ్బు, పేరు వచ్చిన 12 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి వెలుపలి వ్యక్తిగా సుశాంత్ ఫీల్ అయి సూసైడ్ చేసుకున్నాడని అనుకున్నట్టైతే… సుశాంత్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన వ్యక్తులు రోజుకు కనీసం 100 మంది తనువు చాలించాలి. నీకున్న దానితో నీవు సంతోషంగా లేనప్పుడు… నీకు ఎంత ఉన్నప్పటికీ సంతోషంగా ఉండలేవు. గత కొన్ని రోజులగా సుశాంత్‌ను బాలీవుడ్ వేరేగా పెట్టిందని.. పార్టీలకు పిలవలేదని అంటున్నారు. అలాంటి సమయంలో వలస కార్మికులు ఖాళీ కడుపులతో కాళ్లతో వేల కిలోమిటర్లు నడిచిన వాళ్లు తమను తాము చంపుకోవాలి అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Leave a Reply