JUNE 2: TOLLYWOOD NEWS:పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జార్జియాలో చిత్రీకరణ జరుపుతున్న టీమ్ కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు. లాక్ డౌన్ ముగియగానే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు. దానికి సంబంధించిన సెట్ డిజైన్ కూడా మొదలుపెట్టారట. మిగిలిన షూటింగ్ మొత్తం దాదాపు ఫిల్మ్ సిటీలోనే తీస్తారట.

చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ తాలూకు ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయట. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్.

Leave a Reply