TELUGU CINEMA NEWS: నేషనల్ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ హిట్ మూవీ అంధాదున్ తెలుగు రీమేక్ లో నితిన్ నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రముఖల సమక్షంలో మొదలయింది. హిందీలో ఈ చిత్రంలో లేడీ విలన్ గా టబు నటించింది. అక్రమ సంబంధం నెరిపే క్రిమినల్ లేడీగా ఆమె పాత్ర ఉంటుంది. సినిమా మొత్తం హీరో ఆయుశ్మాన్ ఖురానా మరియు టబు చుట్టే తిరుగుతుంది.  ఈ చిత్రంలో నితిన్ గుడ్డివాడి పాత్ర చేస్తున్నారు. గుడ్డివాడైన ప్రొఫెషనల్ పియానో ప్లేయర్ లా అతని పాత్ర భిన్న షేడ్స్ కలిగివుంటుంది. తెలుగులో కూడా టబుని తీసుకొనే అవకాశం ఎక్కువగా కలదు. లేదా బాలీవుడ్ నుండి మరో సీనియర్ హీరోయిన్ తీసుకునే అవకాశం కలదు. విక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్ ఆ తరువాత వరుసగా మూడు ప్లాప్స్ ఎదుర్కున్నాడు. దీనితో ఏడాదిన్నర విరామం తర్వాత భీష్మ చిత్రం విడుదల చేశారు. భీష్మ మూవీ నితిన్ కి బ్లాక్ బస్టర్ హిట్ అందించేలా కనిపిస్తుంది. విడుదలైన మూడు రోజులలో 75 శాతం ప్రీ రిలీజ్ బిజినెస్ రాబట్టింది.  

One Comments

Leave a Reply