MAY 8:TOLLYWOOD NEWS: ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ ద్వారాప్రభాస్20వ సినిమా లాంచింగ్ ఫొటోలుపంచుకున్నారు.యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా  నిర్మిస్తున్నాప్రభాస్20వ సినిమారెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.ప్రభాస్‌తో పాటు పూజా హెగ్డే, ప్రియదర్శన్ పాల్గొన్నారు. లాక్‌డౌన్ పూర్తికాగానే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది.లేటెస్ట్ పీరియడ్ లవ్ డ్రామాలో ప్రభాస్ లుక్ చాల హ్యాండ్ సమ్ గా ఆయన లేడీ ఫ్యాన్స్ ని ఫిదా చేసేదిలా ఉంటుందట. ఆయన రెండు భిన్న గెటప్స్ లో ఈ చిత్రంలో కనిపిస్తాడట. పీరియాడిక్ మరియు మోడరన్ లుక్స్ లో ప్రభాస్ లుక్ ఫీస్ట్ లా ఉంటుందని సమాచారం.ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమా నుంచి అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కనీసం సినిమా టైటిల్‌ను అయినా ప్రకటించాలని కోరుతున్నారు. అయితే, అభిమానులను సంతోషపెట్టడం కోసం ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇవి ఈ సినిమా లాంచింగ్ ఫొటోలు. ఈ సినిమాను 2018లో హైదరాబాద్‌లో ప్రారంభించారు. అయితే, అప్పుడు ప్రారంభోత్సవానికి సంబంధించి ఎలాంటి ఫొటోలను కానీ, వీడియోను కానీ విడుదల చేయలేదు.

Leave a Reply