April 14:TOLLYWOOD NEWS:ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా ఫార్ములాతో క్లాస్ ఫీల్ ఉన్న యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. లాస్ట్ సినిమా ‘సాహో’ అత్యున్నత సాంకేతికతో భారీగానే ఉన్నా పక్కా లోకల్ అనే ఫీలింగ్ కలగలేదు మాస్ ప్రేక్షకులకు. ప్రభాస్ పూర్తి మాస్ ఆడియన్స్ కోసం ఒక యాక్షన్ ఎంటెర్టైనర్ చేయాలని అభిమానుల కోరిక.

తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల ఇండస్ట్రీస్ లో కూడా తనకంటూ మాస్ జనాల్లో ఘనమైన స్టార్ డమ్ ను తెచ్చుకున్నాడు. ప్రభాస్ కి నేషనల్ వైజ్ గా మాస్ ఇమేజ్ బాగా బిల్డ్ అయింది. అందుకే ప్రభాస్ నుండి పక్కా మాస్ పాన్ ఇండియా సినిమా రావాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు.

రెబల్ స్టార్ ప్రభాస్ కి ముందు నుండి మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న పక్కా మాస్ సినిమాకోసం నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని వినికిడి.

Leave a Reply