JUNE 12: TOLLYWOOD NEWS: మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా “సర్కారు వారి పాట” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు పెట్టాలని మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. ఐతే ఆ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో మూడు నెలలు వాయిదా వేస్తూ డిసెంబర్ లో మూవీ షూట్ మొదలుపెడదాం అని అనుకుంటున్నారట.షూటింగ్స్ మొదలుపెట్టినా అనేక ఆంక్షల మధ్య నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సర్కారు వాటి పాట దర్శక నిర్మాతలు రిస్క్ ఎందుకు, వైరస్ ప్రభావం తగ్గాక ప్రశాంతంగా డిసెంబర్ మొదటివారంలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారట.

టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. ఈ టైటిల్ పోస్టర్ మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే గాక.. ఇది పక్కా మాస్ ఓరియెంటెడ్ మూవీ అని తెలిపింది. ఇక ఈ చిత్రంలో విలన్‌గా కన్నడ స్టార్ సుదీప్ నటించనున్నారని సమాచారం.

“సర్కారు వారి పాట” మూవీని దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తుండగా, థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Leave a Reply